గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గురువారం త్రివర్ణ పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్ ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా చందర్ మాట్లాడుతూ.. తెలంగాణ విముక్తి కోసం జరిగిన పోరాటాల్లో అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. “మా నీళ్లు.. మా నిధులు.. మా నియామకాలు” అనే ఆకాంక్షలతో సాగిన మలిదశ ఉద్యమంలో కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో ప్రజలు, రైతులకు సంక్షేమం అందిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులు ఎరువులు, సాగునీరు, విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్నారని అన్నారు.అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ ఉద్యమాల గడ్డ నుంచి బీఆర్ఎస్ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మురళీధర్ రావు, పిటి స్వామి, మేకల సమ్మయ్య యాదవ్, మారుతి, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం.మాజీ ఎమ్మెల్యే కొరుకంటి చందర్
◷ September 17, 2026 | telangananetramtv


Leave a Reply