గోదావరిఖని: (తెలంగాణ నేత్రం)రామగుండం కార్పొరేషన్లో ప్రజా సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా డివిజన్ల వారీగా పేరుకుపోయాయని బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మేకల సమ్మయ్య యాదవ్ అన్నారు. కార్పొరేటర్లుగా ప్రజా సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఎన్నికై ఎనిమిది నెలలు గడుస్తున్నా రెండో కౌన్సిల్ సమావేశం నిర్వహించకపోవడం సరికాదన్నారు. తక్షణమే కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా మార్చాలని ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్‌ను కోరారు. గత కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్లు ప్రస్తావించిన సమస్యల్లో ఎంతవరకు పరిష్కారం లభించిందో వెల్లడించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో 6వ డివిజన్ కార్పొరేటర్ తోకల శ్యామని రమేష్ పాల్గొన్నారు.
తక్షణమే కౌన్సిల్ సమావేశం నిర్వహించాలి
◷ September 17, 2026 | telangananetramtv


Leave a Reply