గణేష్ నవరాత్రులు ప్రశాంతంగా నిర్వహించాలి: సీపీ అంబర్ కిషోర్ ఝా

గోదావరిఖని:(తెలంగాణ నేత్రం)రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేర నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ కార్యాలయంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల అధికారులతో ఆగస్టు నెల నేర సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, తీవ్రమైన నేరాలు, మహిళలు, పోక్సో, ఎస్సీ, ఎస్టీ కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గంజాయి, ఆస్తి నేరాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టాలని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

గణేష్ నవరాత్రుల సందర్భంగా మండపాల వద్ద ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, నిర్వాహకుల వివరాలు సేకరించి పాయింట్ పుస్తకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బందోబస్తు, పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. వినాయక మండపాల్లో డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు, రెచ్చగొట్టే పోస్టులు చేస్తే చట్టప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

▲