జనగామ గణేష్ నగర్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)
రామగుండం కార్పొరేషన్‌ 6వ డివిజన్‌ పరిధిలోని జనగామ గ్రామం గణేష్‌నగర్‌లో సోమవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణనాథుడి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణేష్‌నగర్‌ పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *