

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)
వినాయక చతుర్థి సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన భజన కార్యక్రమంలో ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు. కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారు. వినాయకుని కృపతో రామగుండం నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఎమ్మెల్యే దంపతులు ఆకాంక్షించారు.


Leave a Reply