సౌత్ ఇండియా ఓపెన్ కరాటేలో రామగుండం విద్యార్థుల సత్తా

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)
హుజురాబాద్‌లో ఆదివారం డబ్ల్యూ.ఎఫ్.ఎస్.కె.ఓ ఆధ్వర్యంలో బీఎస్‌ఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన సౌత్ ఇండియా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌–2026లో రామగుండానికి చెందిన జపాన్ షిటోరియో కరాటే స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో కాటాస్, కుమితి విభాగాల్లో రామగుండం విద్యార్థులు పలు పతకాలు సాధించారు.బ్లాక్ బెల్ట్ కాటాస్‌లో కీర్తి మహాజీ బంగారు పతకం సాధించగా, బ్లాక్ బెల్ట్ కుమితిలో ఎం. కార్తికేయన్ బంగారు, కీర్తి మహాజీ వెండి పతకాలు సాధించారు. కలర్ బెల్ట్ కాటాస్‌లో శివన్య, పి. వీర వెండి పతకాలు, నిహాల్ నందన్ కాంస్య పతకం సాధించారు. కలర్ బెల్ట్ కుమితిలో శివన్య బంగారు పతకం, పి. వీర వెండి పతకం, నిహాల్ నందన్ కాంస్య పతకం సాధించారు.పతకాలు సాధించిన విద్యార్థులను, కోచ్ కరాటే శ్రీనివాస్‌ను జపాన్ షిటోరియో కరాటే స్కూల్ అధ్యక్షుడు ఎం. రమేష్, సీనియర్ ఇన్‌స్పెక్టర్లు ఎస్. శ్రీనివాస్, శ్రావణ్ కుమార్ పటేల్, బి. పరమేష్, నిదిష్ కుమార్, రోహిత్ కుమార్ తదితరులు అభినందించారు. అలాగే స్పందన క్లబ్ సెక్రటరీ డా. కె. నరేంద్ర సోనీ, స్పోర్ట్స్ కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్, విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర ప్రముఖులు అభినందనలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *