మదర్ థెరిస్సా పొదుపు సమితి నిర్వాహకుల స్పష్టీకరణ
మంథని: మదర్ థెరిస్సా పొదుపు సమితిపై నామని హరికృష్ణ చేసిన ఆరోపణలు నిరాధారమని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామని సమితి నిర్వాహకులు తెలిపారు. శనివారం మంథని డివిజన్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సమితి లోడీ సంస్థ డివిజన్ కోఆర్డినేటర్ మేకల మల్లేశం మాట్లాడారు.
మహిళలకు ఆర్థికంగా చేయూత అందించాలనే ఉద్దేశంతో 2001 నవంబర్ 1న సమితిని ప్రారంభించామని, అప్పటి నుంచి సంస్థ అభివృద్ధి చెందుతూ కొనసాగుతోందన్నారు. సమితికి సంబంధించిన లెక్కలు, వాస్తవాలు తమ వద్ద ఉన్నాయని, వాటిని మీడియా ముందు వెల్లడించామని తెలిపారు.
సమితి అధ్యక్షురాలు మాదేశి పద్మ, కోశాధికారి నామని సుగుణ మాట్లాడుతూ.. సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేలా నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తప్పుడు ఆరోపణలపై సంబంధిత అధికారులు సమగ్రంగా విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమావేశంలో సమితి డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.


Leave a Reply