మంత్రి శ్రీధర్‌బాబుతో మారిషస్ మంత్రి భేటీ

Minister Sridhar Babu meets with the Mauritius minister

హైదరాబాద్‌: డా. బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును మారిషస్‌ పబ్లిక్‌ సర్వీస్‌, అడ్మినిస్ట్రేటివ్‌ రిఫార్మ్స్‌ శాఖ మంత్రి లుచ్‌మనన్‌ పెంతియా శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ–మారిషస్‌ మధ్య పరిపాలన, టూరిజం, ఐటీ/ఐటీఈఎస్‌, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌, నైపుణ్యాభివృద్ధి, విద్యా రంగాల్లో సహకారంపై చర్చించారు. మారిషస్‌ ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాభివృద్ధికి తెలంగాణ సహకరించాలని పెంతియా కోరారు. రాష్ట్రంలోని ఎంసీహెచ్‌ఆర్‌డీ, యంగ్‌ ఇండియా స్కిల్స్‌ యూనివర్సిటీతో కలిసి పనిచేయడానికి ఆసక్తి ఉందన్నారు. అన్ని రంగాల్లో సహకారానికి తెలంగాణ సిద్ధంగా ఉందని శ్రీధర్‌బాబు తెలిపారు. డిసెంబర్‌ 7, 8 తేదీల్లో జరిగే తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌–2026కు మారిషస్‌ మంత్రిని ఆయన ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *