భూపాలపల్లిలో కెటికె1 లో విషాదం
భూపాలపల్లి :సింగరేణి భూపాలపల్లి ఏరియాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కేటీకే 1 ఇంక్లైన్ గని నైట్ షిఫ్ట్‌లో విధులు నిర్వహిస్తున్న కోల్ కట్టర్ గోపాల గోపి(45)కు గనిలోనే ఒక్కసారిగా ఛాతిలో నొప్పి రావడంతో పాటు తీవ్రంగా చెమటలు పట్టాయి. దీంతో అప్రమత్తమైన తోటి కార్మికులు, అధికారులు వెంటనే అతడిని గని లోపలి నుంచి పైకి తీసుకొచ్చారు. అనంతరం అంబులెన్స్‌లో ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో గోపికి పరిస్థితి విషమించి మృతి చెందినట్లు తోటి కార్మికులు తెలిపారు. గుండెపోటు కారణంగానే మృతి చెందినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. కార్మికుడి మృతితో సహచరుల్లో విషాదం నెలకొంది.


Leave a Reply