వైసీపీని ఆ భయం వెంటాడుతుందా?

అదే తమ గెలుపునకు అడ్డంకా?

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.

ఎవరి సీట్లు గల్లంతవుతాయో?

వైసీపీ లో ఎక్కడో బెరుకు మాత్రం కనిపిస్తుంది. ఈసారి ఎన్నికల్లో గెలవకపోతే పార్టీ మనుగడ కష్ట సాధ్య మవు తుందేమోనన్న భావన ఎక్కువ మంది నేతల్లో కనిపిస్తుంది

గెలుస్తామన్న ధీమా ఉన్నప్పటకి కూటమి కలసి ఉంటే ఓడించడం కష్టమేనన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. మెజారిటీ ఓటర్లు ఇప్పటికీ కూటమి వైపు ఉన్నారన్న విశ్లేషణలు వారిలో ఒకింత భయాన్ని తెచ్చి పెడుతున్నాయి. ఒకవైపు ఇప్పటికే ఓట్ల తొలగింపు భారీగా జరిగింది. మరొకటి ప్రధానంగా డీ లిమిటేషన్ కూడా తమకు కష్టాలు తెచ్చి పెడుతుందన్న భావన వ్యక్తమవుతుంది. నియోజకవర్గాల పెంచాలని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది.

నియోజకవర్గాల పునర్విభజన జరిగితే.ఇంకా సమయం ఉన్నందున డీ లిమిటేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్న లక్ష్యంతో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉంది. అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ లో కూటమి మరింత బలోపేతం అవుతుంది. ఎక్కువ స్థానాలు వస్తాయి కాబట్టి నియోజకవర్గాలు చిన్నవిగా మారిపోతాయి. దీంతో అనేక నియోజకవర్గాలు తమకు అనుకూలంగా ఉన్న వాటిని రిజర్వ్ డ్ చేస్తారు. అప్పుడు ఓటు బ్యాంకు చీలిపోతుంది. వైసీపీ బలహీనమై తాము గెలుపులో వెనకబడి పోతామన్న భయం వారిని వెంటాడుతుంది. అందుకే ఈ దఫా డీలిమిటేషన్ జరగకూడదని వైసీపీ నేతలు బలంగా కోరుకుంటున్నారు. కానీ డీ లిమిటేషన్ ప్రక్రియ మాత్రం వైసీపీ చేతుల్లో లేదన్నది కూడా వాస్తవం. డీ లిమిటేషన్ ప్రక్రియ దేశ వ్యాప్తంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం కావడంతో వైసీపీ అడ్డుకునే అవకాశమూ లేదు. ఎవరి సీట్లు గల్లంతవుతాయో?నియోజకవర్గాల పునర్విభజనలో ఎవరి సీట్లు గల్లంతవుతాయన్న టెన్షన్ మాత్రం వైసీపీ నేతల్లో నెలకొంది. 2009 లో జరిగిన డీ లిమిటేషన్ ప్రక్రియలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తమకు అనుకూలంగా మలచుకుని మరోసారి అధికారంలోకి వచ్చిందన్న విషయాన్ని వైసీపీ నేతలు గుర్తు చేసుకుని ఆందోళన చెందుతున్నారు. అందుకే వైసీపీ నేతలు ఈసారి గెలుపుపై టెన్షన్ లో ఉన్నారు. గత ఎన్నికల్లోనే జనం తమకు నలభై శాతం ఓట్లు వేసినప్పటికీ పదకొండు సీట్లకే పరిమితమయ్యామని, అదే నియోజకవర్గాల పునర్విభజన జరిగి, తమకు అనుకూలమైన ఓట్లు తొలగిస్తే సీట్ల సంఖ్య తగ్గిపోవడంతో పాటు తమకు నలభై శాతం ఓటింగ్ కూడా వస్తుందా? రాదా? అన్న భయం కలుగుతోంది. మొత్తం మీద వైసీపీ అధినేత జగన్ పర్యటనలకు జనం అధికంగా వస్తున్నప్పటికీ కానీ ఏ మూలో మాత్రం తమకు ప్రజల మద్దతు ఉన్నా, గెలుపు దక్కదేమోనన్న ఆందోళన అధికంగా వైసీపీలో ఉంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *