
హైదరాబాద్, ఆగస్టు (తెలంగాణ నేత్రం)
ఉమ్మడి కరీంనగర్ జిల్లా అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో కొనసాగుతున్న, చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ పాల్గొన్నారు.సమావేశంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్తో పాటు ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, చింతకుంట విజయరమణ రావు పాల్గొన్నారు.జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతి, కొత్తగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, రహదారులు, తాగునీరు, డ్రైనేజీ తదితర మౌలిక వసతులపై సమగ్రంగా చర్చించారు. రామగుండం నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు, భవిష్యత్లో చేపట్టాల్సిన ప్రాధాన్యతా పనులను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సమావేశంలో వివరించారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందించాలని కోరారు.ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను వేగవంతం చేసి ఉమ్మడి కరీంనగర్ జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రులు పేర్కొన్నారు.సమావేశంలో రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన అధికారులు పాల్గొన్నారు.


Leave a Reply