కాంగ్రెస్ మెడకు “22 ఎ”…

బయటపడేందుకు ప్రయత్నం

22 ఎ అంటే ఏంటంటే?

తెలంగాణలో సెక్షన్ 22-ఏ వివాదం కాంగ్రెస్ సర్కార్ మెడకు చుట్టుకుంది. అయితే దీని నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ప్రారంభిచింది. 22ఎ నిషేధిత భూముల జాబితా ప్రైవేట్, అసైన్డ్ భూమి చేరడం వల్ల వేలాది మంది సామాన్య ప్రజలు, రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాజకీయంగా ఇరుకున పెట్టింది. ప్రతిపక్షాలు దీనిపై తీవ్ర విమర్శలు చేస్తుండటంతో, ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ప్రైవేట్ పట్టా భూములు కూడా 22-ఏ జాబితాలోకి చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.రాష్ట్రవ్యాప్తంగా సామాన్య యజమానులు తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు గురవుతున్నారు. మేడ్చల్, మల్కాజ్‌గిరి వంటి అర్బన్ ప్రాంతాల్లో వందల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి.అనేక భవనాలు, భూములు క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. ఫలితంగా 22 ఎ భయం తెలంగాణను పట్టి పీడిస్తుంది.

ప్రతిపక్షాల పోరు బాట…

బీఆర్ఎస్ నేతలు ఈ సెక్షన్‌ను ప్రభుత్వం అడ్డగోలుగా మారుస్తోందని ఆరోపించారు. తప్పుగా చేర్చిన జాబితాను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.దీనిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని పట్టుబట్టారు.ప్రభుత్వ స్పందనఅర్హులైన భూ యజమానులకు ఎలాంటి నష్టం జరగదని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసా ఇచ్చారు.సమస్య పరిష్కారానికి అధికారులు సబ్-రిజిస్ట్రార్ వారీగా వివరాలు సేకరించి, దిద్దుబాటు చర్యలు చేపడుతున్నారు. అయినా బీఆర్ఎస్ నేతలు మాత్రం ప్రయివేటు వ్యక్తులకు చెందిన భూముల నుంచి సొమ్ములు వసూలు చేయడానికే 22 ఎను తీసుకు వచ్చారని అన్నారు. నిషేధిత భూములు, ఆస్తులు క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు, వాగులు, చెరువుల శిఖం భూములు, మరియు
వివాదాస్పద ఆస్తుల అమ్మకాలను ఆపడానికి రిజిస్ట్రేషన్ చట్టం కింద సెక్షన్ 22-ఏను తెచ్చారు.ఈ జాబితాలో ఉన్న భూములకు సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎలాంటి రిజిస్ట్రేషన్లు లేదా బదిలీలు జరగవు.

22 ఎ అంటే ఏంటంటే?

అధికారులు ఎలాంటి సరైన క్షేత్రస్థాయి పరిశీలన, వెరిఫికేషన్ చేయకుండానే ప్రైవేట్ పట్టా భూములు, అపార్ట్‌మెంట్లను కూడా పొరపాటున 22-ఏ జాబితాలో చేర్చారు.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో వేలాది ఎకరాల ప్రైవేట్ ఆస్తులు నిలిచిపోవడంతో యజమానులు ఆందోళన చెందుతున్నారు.అత్యవసర వైద్యం, పిల్లల పెళ్లిళ్లు, విద్యా వసరాల కోసం ఆస్తులు అమ్ముకుందామన్నా కుదరక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం స్పందన మరియు పరిష్కారంప్రజలు ఆందోళన చెందవద్దని, ఇది కేవలం అడ్మినిస్ట్రేటివ్ పొరపాటు వల్ల జరిగిందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ సమస్యల పరిష్కారానికి ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు.తప్పుగా చేర్చిన ఆస్తులను మూడు నుంచి ఐదు రోజుల్లో పరిష్కరిస్తామని, రెవెన్యూ లేదా రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *