పెద్దపల్లి జిల్లాలో మంత్రుల పర్యటన.

ఆర్‌అండ్‌బీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు. పెద్దపల్లి, ఆగస్టు 18: ఆర్‌అండ్‌బీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు బుధవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, రామగుండం ప్రాంతాల్లో ఆర్‌అండ్‌బీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడంతో పాటు పలు బహిరంగ సభల్లో పాల్గొంటారు. పర్యటనలో భాగంగా ఉదయం 11:30 గంటలకు పెద్దపల్లి IDOCకు మంత్రులు చేరుకుంటారు. అనంతరం 11:45 నుంచి 12 గంటల వరకు గర్రెపల్లి వద్ద ఆర్‌అండ్‌బీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 12:10 నుంచి 1:45 గంటల వరకు సుల్తానాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించి, అనంతరం జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 నుంచి 2:30 గంటల వరకు శివపల్లిలో ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు నివాసంలో భోజనం చేస్తారు. మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఆర్‌అండ్‌బీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం 4:30 నుంచి 5:45 గంటల వరకు రామగుండంలో ఆర్‌అండ్‌బీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *