
పెద్దపల్లి, ఆగస్టు 17: రామగుండంలోని సింగరేణి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో 70 ఏళ్ల మహిళకు మోకాలు మార్పిడి శస్త్రచికిత్సను వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. గత రెండేళ్లుగా తీవ్రమైన మోకాలి నొప్పి, నడకలో ఇబ్బందితో బాధపడుతున్న ఆమెకు పరీక్షల్లో తీవ్ర ఆర్థరైటిస్, మోకాలి వైకల్యం ఉన్నట్లు గుర్తించారు. ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి ప్రొఫెసర్ డాక్టర్ ప్రదీప్ చంద్ర ఆధ్వర్యంలో ఆగస్టు 12న శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండి, సంతృప్తికరంగా కోలుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ಸರ್ಕారీ వైద్య సంస్థలో అధునాతన మోకాలు మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం కావడం అభినందనీయమని పేర్కొన్నారు.


Leave a Reply