సుందిల్ల గ్రామ బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ బీఆర్ఎస్ అధ్యక్షుడు బోగిరి భాస్కర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.
అనంతరం భారత ఎన్నికల సంఘం చేపట్టిన SIR కార్యక్రమంలో ఓటర్ల ఇన్యూమరేషన్ ప్రక్రియను పూర్తి చేసిన BLOలు గర్రెపెల్లి పద్మ, ఈదునూరి చంద్రకళ, గడ్డం వసంతలను గ్రామ శాఖ ఆధ్వర్యంలో సన్మానించి అభినందించారు. ఫైనల్ డ్రాఫ్ట్ వరకు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు.
కార్యక్రమంలో గ్రామ పాలకవర్గ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, యువజన, ఎస్సీ విభాగాల ప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Leave a Reply