జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశంపెద్దపల్లి, ఆగస్టు 14: జిల్లాలో ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో తాగునీటి సరఫరా, సమస్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, క్షేత్రస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ప్రతి గ్రామం, ప్రతి వార్డులో తాగునీటికి సంబంధించిన సమస్యలను గుర్తించాలని సూచించారు. గ్రామాలు, వార్డుల వారీగా తాగునీటి సరఫరా పరిస్థితి, ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలపై సమగ్ర నివేదిక సిద్ధం చేసి అందించాలని ఆదేశించారు.
ప్రతి గ్రామం, వార్డులో తాగునీటి సమస్యలను గుర్తించి పరిష్కరించాలి
◷ August 14, 2026 | telangananetramtv


Leave a Reply