16 మంది అరెస్ట్.. రూ.24,040 నగదు, 18 ద్విచక్ర వాహనాలు స్వాధీనంమంచిర్యాల: వేమనపల్లి మండలం కల్లెంపల్లి గ్రామ శివారులో కోడి పందేల పేరుతో బెట్టింగ్ నిర్వహిస్తున్న స్థావరంపై రామగుండం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు టాస్క్ఫోర్స్ ఏసీపీ శ్రీనివాస్ నేతృత్వంలో ఎస్సై రమేష్, నీల్వాయి ఎస్సై నాగరాజు సిబ్బందితో కలిసి బుధవారం అర్ధరాత్రి దాడి నిర్వహించారు.ఈ సందర్భంగా కోడి పందేలు నిర్వహిస్తున్న 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 4 కోళ్లు, 45 కత్తులు, 18 ద్విచక్ర వాహనాలు, 12 మొబైల్ ఫోన్లు, రూ.24,040 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారితో పాటు స్వాధీనం చేసుకున్న వస్తువులు, వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల కోసం నీల్వాయి పోలీస్ స్టేషన్కు తరలించారు.చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా హెచ్చరించారు. కోడి పందేలు, జూదం, బెట్టింగ్ వంటి కార్యకలాపాలకు ఎవరూ పాల్పడవద్దని సూచించారు. ఇలాంటి కార్యకలాపాలకు స్థావరాలు ఏర్పాటు చేయడం, నిర్వహించడం లేదా సహకరించడం వంటివి చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
కోడి పందేల స్థావరంపై టాస్క్ఫోర్స్ దాడి
◷ August 13, 2026 | telangananetramtv


Leave a Reply