గోదావరిఖని, ఆగస్టు 13(తెలంగాణ నేత్రం)రామగుండం ఏరియా-1లోని జీడీకే 2&2ఏ ఇంక్లైన్, జీడీకే 2 సెక్షన్‌లో గురువారం ‘సురక్షక తిరంగా’ సైబర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. జీఎం ఆర్జీ-1 డి. లలిత్ కుమార్ ఆదేశాల మేరకు, సైబర్ క్రైమ్ ఎస్‌ఐ మారుతి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో సైబర్ మోసాలపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు.సైబర్ మోసానికి గురైన వెంటనే 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని, బ్యాంకు వివరాలు, ఓ టీ పి,పాన్ , ఆధార్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోవద్దని సూచించారు. అనుమానాస్పద లింకులు, ఏ పి కె ఫైల్స్, తెలియని యాప్‌లను ఓపెన్ చేయవద్దని, పోలీసుల పేరుతో వచ్చే బెదిరింపు కాల్స్‌కు భయపడవద్దని తెలిపారు. పెట్టుబడి మోసాలపైనా అవగాహన కల్పించారు.కార్యక్రమంలో గని మేనేజర్ ఇజ్జగిరి శివయ్య, వెల్ఫేర్ ఆఫీసర్ డి. గణేష్, సెక్షన్ ఇంచార్జ్ సల్మాన్ ఖాన్, వెంటిలేషన్ ఆఫీసర్ జి. కుమారస్వామి, అధికారులు, సూపర్వైజర్లు, మహిళా ఉద్యోగులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సురక్షక తిరంగా’ సైబర్ అవేర్నెస్
◷ August 13, 2026 | telangananetramtv


Leave a Reply