ముస్త్యాల, ఆగస్టు 12: రామగిరి మండలం ముస్త్యాల గ్రామంలో డా. బీఆర్ అంబేద్కర్, కొమురం భీమ్, పూలే దంపతులు, బిర్సా ముండా, భగత్‌సింగ్, చాకలి ఐలమ్మ తదితర మహనీయుల విగ్రహాల ఏర్పాటుకు బుధవారం స్థల పరిశీలన చేపట్టారు. మాజీ సర్పంచ్ రామగిరి లావణ్య–నాగరాజు దంపతుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మహనీయుల విగ్రహాలు సమాజ ఆత్మగౌరవానికి, చైతన్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని నాయకులు పేర్కొన్నారు. విగ్రహాల ఏర్పాటుకు ప్రభుత్వం, అధికారులు సహకరించాలని కోరారు.
మహనీయుల విగ్రహాలు చైతన్య కేంద్రాలు
◷ August 13, 2026 | telangananetramtv


Leave a Reply