
రామగుండం: పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించి, నాణ్యమైన దర్యాప్తుతో నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా పోలీసు అధికారులను ఆదేశించారు. కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో సీసీటీఎన్ఎస్ 2.0 ద్వారా కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, నేర నియంత్రణ చర్యలను సమీక్షించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గంజాయి, అక్రమ ఇసుక రవాణా, పేకాట, పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.


Leave a Reply