రామగుండం: కాంగ్రెస్ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ స్పందించారు. కుమారస్వామికి మెరుగైన వైద్యం అందేలా సంబంధిత వైద్యులతో స్వయంగా మాట్లాడి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. మనాలి ఠాకూర్ కూడా కుమారస్వామితో మాట్లాడి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు ఆకాంక్షించారు. కుమారస్వామి కుటుంబానికి తమ కుటుంబం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
కుమారస్వామి కుటుంబానికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ అండ
◷ August 10, 2026 | telangananetramtv


Leave a Reply