గోదావరిఖని: (తెలంగాణ నేత్రం)
కర్నూలులోని పుష్పరాజ్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన 13వ జీకేఎంఏ నేషనల్ లెవెల్ కరాటే ఛాంపియన్‌షిప్-2026లో రామగుండానికి చెందిన జపాన్ షిటోరియో కరాటే స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి 2,652 మంది విద్యార్థులు పాల్గొన్న ఈ పోటీల్లో కటాస్, కుమితి విభాగాల్లో విద్యార్థులు బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు.
బ్లాక్ బెల్ట్ కటాస్‌లో సునీహ సుల్తానా, ఎం. కార్తికేయన్ బంగారు పతకాలు సాధించగా.. సంయుక్త ఎస్ వెండి, ఎం. ముక్తిశ్రీ, హేమలత మాజీ, బి. ఆశ్రిత, టి. సాత్విక్ కాంస్య పతకాలు సాధించారు. బ్లాక్ బెల్ట్ కుమితిలో ఎం. ముక్తిశ్రీ, సునీహ సుల్తానా బంగారు పతకాలు, సంయుక్త ఎస్, ఎం. కార్తికేయన్, హేమలత మాజీ వెండి పతకాలు, బి. ఆశ్రిత, టి. సాత్విక్ కాంస్య పతకాలు అందుకున్నారు.
కలర్ బెల్ట్ కటాస్‌లో రిదా సహరిష్ వెండి, ఎన్. మితాలి, పి. మోహిత్ కాంస్య పతకాలు సాధించగా, కుమితిలో పి. మోహిత్, రిదా సహరిష్ బంగారు, ఎన్. మితాలి కాంస్య పతకం సాధించారు. విజేతలను కోచ్ కరాటే శ్రీనివాస్, స్కూల్ అధ్యక్షుడు ఎం. రమేష్, సీనియర్ ఇన్‌స్పెక్టర్లు, స్పోర్ట్స్ కౌన్సిల్, స్పందన క్లబ్ ప్రతినిధులు, తల్లిదండ్రులు అభినందించారు.


Leave a Reply