వెయ్యి రోజుల ప్రజాపాలనపై సమీక్ష

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)
వెయ్యి రోజుల ప్రజాపాలన పూర్తి సందర్భంగా రామగుండం క్యాంప్ కార్యాలయంలో సోమవారం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. పెండింగ్ సమస్యలను గుర్తించి, ప్రజలకు మెరుగైన సేవలు అందేలా సమన్వయంతో పనిచేయాలని నాయకులు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో మేయర్ మహంకాళి స్వామి, కార్పొరేషన్ అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు, సర్పంచులు, వార్డు సభ్యులు, డివిజన్ ఇన్‌చార్జిలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *