గుంతలమయంగా మారిన రహదారి.. సింగరేణి నిర్లక్ష్యంపై ప్రజల ఆవేదన

గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)
: సుందిళ్ల గ్రామంలోని ప్రధాన రహదారి గుంతలమయంగా మారి అధ్వానంగా తయారైంది. రోడ్డు మొత్తం చిల్లులు పడినట్టుగా ఉండటంతో గ్రామ ప్రజలు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సింగరేణి అధికారులు లాభాలపై చూపుతున్న శ్రద్ధ ప్రజలు, కార్మికుల వినియోగానికి ఉన్న రహదారులపై చూపడం లేదని స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారి పరిస్థితి రోజురోజుకు మరింత దారుణంగా మారుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
తక్షణమే రహదారికి మరమ్మతులు చేపట్టి ప్రజలు, కార్మికుల ఇబ్బందులను తొలగించాలని గ్రామస్థులు కోరుతున్నారు.



Leave a Reply