
గోదావరిఖని,(తెలంగాణ నేత్రం)
రామగుండం కార్పొరేషన్ 6వ డివిజన్ పరిధిలోని జనగామ గ్రామం గణేష్‌నగర్‌లో సోమవారం వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గణనాథుడి విగ్రహాన్ని భక్తిశ్రద్ధలతో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గణేష్‌నగర్ పరిసరాలు భక్తుల సందడితో కళకళలాడాయి.


Leave a Reply