గోదావరిఖని,)తెలంగాణ నేత్రం)
పోలీస్ కమిషనరేట్ హెడ్‌క్వార్టర్స్‌లో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సీపీ అంబర్ కిషోర్ ఝా అధికారులతో కలిసి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలకు, పోలీసు అధికారులు, సిబ్బందికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని, నిమజ్జన శోభాయాత్ర వరకు పోలీసు శాఖకు సహకరించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కె. శ్రీనివాస్, ఏసీపీ నాగేంద్ర గౌడ్, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
హెడ్‌క్వార్టర్స్‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
◷ September 14, 2026 | telangananetramtv


Leave a Reply