రేవంత్‌ను CM చేసింది అధిష్టానమే..

ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు:AICC

తెలంగాణ కాంగ్రెస్‌లో కొంతకాలంగా నెలకొన్న అంతర్గత పరిణామాలు, నేతల వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్రస్థాయిలో స్పందించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ, పార్టీ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్న నేతలకు ఏఐసీసీ గట్టి హెచ్చరికలు జారీ చేసింది.రాష్ట్రంలో పార్టీకి వ్యతిరేకంగా ఎవరెవరు మాట్లాడుతున్నారు.. వెనుక ఉండి ఎలాంటి పనులు చేస్తున్నారనే దానిపై తమ దగ్గర పూర్తి సమాచారం ఉందని హైకమాండ్ స్పష్టం చేసింది. ఇకపై ఇటువంటి చర్యలను ఏమాత్రం సహించేది లేదని తేల్చిచెప్పింది.సహనానికి హద్దు ఉంటుంది..పార్టీ నేతల ఓపికకు, అధిష్టాన సహనానికి కూడా ఒక హద్దు ఉంటుందని.. ఇకపై క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎవరినీ విడిచిపెట్టేది లేదని, కఠిన చర్యలు (వేటు) తప్పవని హెచ్చరించింది. ఏఐసీసీ స్పష్టమైన నిర్ణయంతోనే రేవంత్ రెడ్డిని తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రకటించిందని ప్రస్తావించింది. అధిష్టానం నియమించిన సీఎంపై తరచూ బహిరంగ వ్యాఖ్యలు చేయడం తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యమని పేర్కొంది. సొంత పార్టీ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడే నాయకులు ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని, లేనిపక్షంలో క్రమశిక్షణా కమిటీ ద్వారా చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పబ్లిక్ డొమైన్‌లో జరుగుతున్న చర్చలు, నాయకుల వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తున్నామని, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉండని వారిపై రాబోయే రోజుల్లో కఠిన నిర్ణయాలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *