గోదావరిఖని: భార్య స్వప్నపై కత్తెరతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన పర్లపల్లి సంపత్ (43)కు గోదావరిఖని అసిస్టెంట్ సెషన్స్ కోర్టు రెండేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. 2022లో రూ.1,000 ఇవ్వలేదన్న కోపంతో భార్య మెడ, పక్కటెముకలపై కత్తెరతో దాడి చేసిన ఘటనపై గోదావరిఖని 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో న్యాయస్థానం శిక్ష విధించింది. కేసు దర్యాప్తు, కోర్టు విచారణలో సహకరించిన పోలీసు సిబ్బందిని రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.
భార్యపై కత్తెరతో హత్యాయత్నం.. భర్తకు రెండేళ్ల జైలు
◷ August 31, 2026 | telangananetramtv

Leave a Reply